భారతదేశం, ఏప్రిల్ 8 -- రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే బిగ్ అలర్ట్ ఇచ్చింది. హైదరాబాద్ లోని కాచిగూడ నుంచి నడిచే పలు రైళ్లను రద్దు చేసింది. మొత్తం 12 రైళ్లు పలు తేదీల్లో రద్దయ్యాయి. ఇందుకు సంబంధించిన వివరాలను దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.

దక్షిణ మధ్య రైల్వే ప్రకటనలోని వివరాల ప్రకారం.. కాచిగూడ నుంచి మహబూబ్ నగర్ కు వెళ్లే ( నంబర్ 67781)ను ఏప్రిల్ 10వ తేదీ నుంచి 18వ తేదీ వరకు రద్దు చేశారు.

మహబూబ్ నగర్ - మన్యంకొండ స్టేషన్ల మధ్య జరుగుతున్న డబ్లింగ్ పనుల కారణంగా ఈ రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించి... టికెట్లను బుకింగ్ చేసుకోవాలని కోరింది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....