భారతదేశం, జూన్ 1 -- Traffic Restrictions Secunderabad : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జూన్ 2వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ అధికారిక వేడుకలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో పరేడ్ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాల్లో, అక్కడికి దారితీసే అన్ని ప్రధాన రహదారుల్లో ఉదయం నుంచి వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు జూన్ 2న ఉదయం 7:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు సికింద్రాబాద్ ఏరియాలో విస్తృతమైన ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు విధిస్తున్నట్లు మల్కాజ్‌గిరి ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు.

పరేడ్ గ్రౌండ్స్ వైపు వెళ్లే సాధారణ వాహనదారుల కోసం ట్రాఫిక్ పోలీసులు పలు ప్రత్...