భారతదేశం, అక్టోబర్ 11 -- భారత ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విపణిలో బలమైన స్థానాన్ని సంపాదించుకున్న 'టయోటా కిర్లోస్కర్ మోటార్'.. తన పాపులర్ మోడల్ గ్లాంజాలో ఆకర్షణీయమైన మార్పులు చేస్తోంది! అక్టోబర్ 14, 2026న ఈ గ్లాంజా ఫేస్​లిఫ్ట్​ని అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు ప్రకటించిన టయోటా, దానికి సంబంధించి సరికొత్త టీజర్‌ను సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. ఈ చిన్న వీడియో క్లిప్‌లో కారు ముందు భాగంలో చేసిన డిజైన్ మార్పులను స్పష్టంగా చూపించారు.

లాంచ్​ నేపథ్యంలో ఈ టయోటా గ్లాంజా ఫేస్​లిఫ్ట్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

మారుతీ సుజుకీ బలెనో ప్లాట్​ఫామ్​పైనే ఈ గ్లాంజాని తయారు చేస్తున్నారన్న విషయం తెలిసిందే. ఇక గత నెలలో వచ్చిన బలెనో ఫేస్​లిఫ్ట్​కి లభించిన అప్​డేట్లకు అనుగుణంగానే గ్లాంజాలో కొత్త హంగులతో రెడీ అవుతోంది. టీజర్ ఆధారంగా:

కొత్త ...