భారతదేశం, ఆగస్టు 8 -- Toxic Trailer: 'కేజీఎఫ్' సిరీస్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ ఏ తరహా సినిమాలో నటిస్తాడా అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూశారు. ఆ నిరీక్షణకు తెర దించుతూ వచ్చిన 'టాక్సిక్' ట్రైలర్ ఇండియన్ సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించేలా ఉంది. టాక్సిక్ ట్రైలర్ ను ఇవాళ (ఆగస్టు 8) రిలీజ్ చేశారు.

శనివారం రిలీజైన మోస్ట్ అవేటెడ్ మూవీ టాక్సిక్ ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ సినిమాలో యశ్ 'రాయా', 'టికెట్' అనే రెండు విభిన్నమైన, అత్యంత వైలెంట్ పాత్రలలో కనిపిస్తున్నట్లు ట్రైలర్ స్పష్టం చేసింది. తన నట విశ్వరూపంతో యశ్ ఈ సినిమాకు బ్యాక్ బోన్ గా నిలిచాడు.

దర్శకురాలు గీతూ మోహన్ దాస్ సృష్టించిన ఈ నేర ప్రపంచం భారతీయ సినిమాలో ఇప్పటివరకు చూడని రీతిలో ఉంది. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, బలమైన ఎమోషన్స్, డార్క్ థీమ...