భారతదేశం, ఆగస్టు 25 -- Toxic Tickets Rate Hike In Telangana: రాకింగ్ స్టార్ యశ్ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ 'టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్' (Toxic: A Fairy Tale for Grown-Ups) రిలీజ్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది. ఆగస్ట్ 26న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఊరట ఇచ్చింది. తెలంగాణలో 'టాక్సిక్' సినిమా టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతినిస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ అఫీషియల్ జీవో జారీ చేసింది.

తెలంగాణ ప్రభుత్వ జీవో ప్రకారం.. టాక్సిక్ మూవీ కోసం ఆగస్ట్ 26 నుంచి సెప్టెంబర్ 4 వరకు పది రోజుల పాటు పెంచిన టికెట్ ధరలు అమల్లో ఉంటాయి. సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్‌లు, స్పెషల్ థియేటర్లలో జీఎస్టీతో కలిపి ఈ పెంపు వర్తిస్తుంది.

సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్‌పై రూ. 50 అద...