భారతదేశం, ఆగస్టు 13 -- Toxic Runtime: కేజీఎఫ్ చాప్టర్ 2 క్రియేట్ చేసిన సునామీ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ బాక్సాఫీస్‌పై దండయాత్ర చేయడానికి సిద్ధమయ్యారు. ఆయన నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా 'టాక్సిక్' (Toxic: A Fairy Tale for Grown-Ups) సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఆగస్టు 26న థియేటర్లలోకి గ్రాండ్‌గా వస్తోంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ 'A' సర్టిఫికెట్ జారీ చేయడంతో ఫ్యాన్స్‌లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

ఈ మోస్ట్ వైలెంట్ గ్యాంగ్‌స్టర్ కథనంలో అడల్ట్ కంటెంట్, రఫ్ యాక్షన్ సీక్వెన్సెస్ ఎక్కువగా ఉండటంతో సీబీఎఫ్‌సీ (CBFC) నుంచి 'A' సర్టిఫికెట్ లభించింది. అయితే ప్రమోషనల్ కంటెంట్ చూసిన తర్వాత ఇది అందరూ ఊహించినదే అయినా, అసలు సర్‌ప్రైజ్ ఏంటంటే ఈ సినిమా రన్‌టైమ్. దాదాపు 3 గంటల 14 నిమిషాలు (194 నిమిషాలు) ...