భారతదేశం, అక్టోబర్ 10 -- Toxic OTT: రాకింగ్ స్టార్ యష్ హీరోగా వచ్చిన భారీ పాన్-ఇండియా యాక్షన్ డ్రామా 'టాక్సిక్' (Toxic) బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఓటీటీ రిలీజ్ పరంగానూ ఈ మూవీకి షాక్ తగిలిందని తెలిసింది. ఈ సినిమా ప్రొడ్యూసర్లలో ఒకరైన యష్ కు టాక్సిక్ ఓటీటీ డీల్ తో ఊహించలేని షాక్ తగిలిందని అంటున్నారు.

బోల్డ్ యాక్షన్ డ్రామా టాక్సిక్ మూవీ ఓటీటీ రిలీజ్ పై సస్పెన్స్ కొనసాగుతోంది. ఆగస్టు 26న ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది. ఇప్పటికే ఆరు వారాలు కంప్లీట్ అయ్యాయి. అయినా ఓటీటీ రిలీజ్ పై మాత్రం క్లారిటీ లేదు. ఈ టాక్సిక్ మూవీ ఓటీటీ డీల్ ఇంకా క్లోజ్ కాకపోవడంమే అందుకు కారణంగా తెలుస్తోంది.

'కేజీఎఫ్ 2' వంటి సంచలన విజయం తర్వాత యష్ నుంచి వచ్చిన సినిమా కావడంతో 'టాక్సిక్' ప్రాజెక్ట్‌పై విడుదల ముందే గ్లోబల్ స్థాయిలో భారీ అంచనాలు నెలక...