భారతదేశం, ఆగస్టు 28 -- Toxic Collections: తొలిరోజే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరి అదరగొట్టిన రాకింగ్ స్టార్ యశ్ తాజా చిత్రం 'టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్' (Toxic: A Fairy Tale for Grown-Ups)కు రెండో రోజు దిమ్మతిరిగే షాక్ తగిలింది. బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ స్పీడ్ ఒక్కసారిగా పడిపోయింది.

ట్రేడ్ అనలిస్ట్ సంస్థ 'సాక్‌నిల్క్' (Sacnilk) గణాంకాల ప్రకారం 'టాక్సిక్' చిత్రం గురువారం (ఆగస్టు 27) ఇండియాలో రూ.36.40 కోట్ల నెట్ కలెక్షన్లు మాత్రమే సాధించింది. దేశవ్యాప్తంగా 19,413 షోలలో ఈ సినిమా సగటున 26.6 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది.

రెండో రోజు టాక్సిక్ కలెక్షన్లు ఏకంగా 64 శాతం పడిపోవడం గమనార్హం. తొలిరోజున రూ.101.10 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించిన టాక్సిక్ చిత్రం, రెండో రోజున ఏకంగా 64 శాతం మేర వసూళ్లలో డిప్ చూసింది. దీంతో రెండు రోజులు పూర్తయ్...