భారతదేశం, సెప్టెంబర్ 1 -- Toxic Collections: కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నటించిన 'టాక్సిక్' (Toxic: A Fairy Tale for Grown-Ups) సినిమా మండే టెస్టులో దారుణంగా ఫెయిల్ అయింది. బంపర్ ఓపెనింగ్స్ సాధించిన ఈ చిత్రం, ఆరవ రోజు నాటికి సింగిల్ డిజిట్ వసూళ్లకు పడిపోయి ట్రేడ్ వర్గాలకు షాక్ ఇచ్చింది. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి నెగెటివ్ రివ్యూలు రావడం కలెక్షన్లపై తీవ్ర ప్రభావం చూపింది.

మొదటి రోజు కలెక్షన్ల సునామీ సృష్టించిన 'టాక్సిక్', ఆ తర్వాత అదే ఊపును కొనసాగించడంలో దారుణంగా విఫలమైంది. దేశవ్యాప్తంగా తొలిరోజు రూ.101 కోట్ల నెట్ (రూ. 120 కోట్ల గ్రాస్) వసూలు చేసి, ఈ ఏడాది 'ధురంధర్ 2' (రూ.103 కోట్లు) తర్వాత సెకండ్ బెస్ట్ ఓపెనింగ్‌గా నిలిచింది టాక్సిక్.

టాక్సిక్ సినిమాకు వచ్చిన నెగెటివ్ టాక్ ప్రభావంతో.. శనివారం రూ.25.15 కోట్లు, ఆదివా...