భారతదేశం, ఆగస్టు 30 -- Yash Toxic 4 Days Worldwide Collection: 'కేజీఎఫ్' సిరీస్ తర్వాత కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా, గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో వచ్చిన గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా 'టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్'. థియేటర్లలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ఈ సినిమా వసూళ్ల సునామీ సృష్టిస్తోంది.

భారీ అంచనాల మధ్య ఆగస్టు 26న థియేటర్లలో విడుదలైన ఈ టాక్సిక్ చిత్రం నాలుగో రోజు (ఆగస్టు 29) నాటికి రూ. 250 కోట్ల క్లబ్‌లో చేరి తన బాక్సాఫీస్ స్టామినాను నిరూపించుకుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా యశ్‌కి ఉన్న విపరీతమైన ఫాలోయింగ్‌తో 'టాక్సిక్' చిత్రానికి ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి.

మిక్స్‌డ్ రివ్యూలు, నెగెటివ్ టాక్ వచ్చినప్పటికీ థియేటర్ల వద్ద ప్రేక్షకుల హడావుడి తగ్గకపోవడమే ఈ భారీ వసూళ్లకు ప్రధాన కారణం. తొలి రోజే భారతదేశ వ్యాప్తంగా రూ. 101.10 కోట్ల...