భారతదేశం, జూలై 2 -- Toxic Censor: కేజీఎఫ్ తో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నాడు కన్నడ రాక్ స్టార్ యశ్. ఈ మూవీస్ తర్వాత గ్యాప్ తీసుకుని ఇప్పుడు 'టాక్సిక్' అంటూ థియేటర్లకు రాబోతున్నాడు. కానీ ఈ మూవీ గ్లింప్స్ నుంచి లేడీస్ అండ్ లేడీస్ వీడియో వరకూ అంతా వివాదాస్పదమే. ఈ మూవీలోని మితిమీరిన శృంగార‌ సీన్లు, హద్దుల్లేని విధ్వంసకర వైలెన్స్ ఇందుకు కారణమని చెప్పొచ్చు.

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఎక్కువ వైలెన్స్ ఉంటేనో లేదా మితిమీరిన శృంగార‌ం ఉంటేనో మూవీ హిట్ అవుతుందనే టాక్ ఉందని అంటున్నారు. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాల విషయంలో ఈ ఫార్ములాను ఫాలో అయ్యే వాళ్ల సంఖ్య పెరుగుతోంది. ఇప్పుడు టాక్సిక్ కూడా ఇదే లిస్ట్ లో చేరిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

టాక్సిక్ గ్లింప్స్ రిలీజ్ అయినప్పుడే వివాదం భగ్గున రేకెత్తింది. ఈ గ్లింప్స్ లో కార్లో ఓ అమ్మాయిత...