భారతదేశం, మార్చి 1 -- టాక్సిక్ మూవీని వివాదాలు వీడటం లేదు. యశ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా మరోసారి కాంట్రవర్సీలో చిక్కుకుంది. టాక్సిక్ హీరోయిన్ కియారా అద్వాణి ఫొటోను ఏఐతో క్రియేట్ చేశారనే ట్రోల్స్ వస్తున్నాయి. అసలేమైందో ఇక్కడ తెలుసుకోండి.

టాక్సిక్ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ 'తబాహీ' ను రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ఫస్ట్ ఓ పోస్టర్ పంచుకున్నారు. ఇందులో హీరోయిన్ కియారా ముఖం కనిపించలేదు. కేవలం యశ్ ను మాత్రమే హైలైట్ చేశారు. దీంతో పురష అహంకారం అంటూ విపరీతమైన విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మేకర్స్ కియారా అద్వాణి, యశ్ రొమాంటిక్ గా ఉన్న మరో పోస్టర్ ను శనివారం (ఫిబ్రవరి 28) రాత్రి రిలీజ్ చేశారు.

లేెటెస్ట్ పోస్టర్ లో కియారా అద్వాణి, యశ్ రొమాంటిక్ గా ఉన్నారు. బీచ్ లో కియారా కూర్చుని ఉండగా, షర్ట్ లేకుండా ఉన్న యశ్ ఆమె ఒడిలో పడుకున్నాడు. యష్ కేవలం గ్రే ప్యా...