భారతదేశం, మార్చి 31 -- మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయికలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక మూవీ (NTR Neel) గురించి ఒక కీలక అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం మలయాళ స్టార్ హీరో టోవినో థామస్‌ను సంప్రదించినట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఈ ప్రాజెక్టులో తాను భాగం కావడం లేదని టోవినో తాజాగా స్పష్టం చేశాడు.

మంగళవారం (మార్చి 31) హైదరాబాద్‌లో తన రాబోయే మలయాళ సినిమా 'పల్లిచట్టంబి' (Pallichattambi) ప్రమోషన్స్‌లో పాల్గొన్న టోవినో థామస్.. ఎన్టీఆర్ సినిమాపై వస్తున్న వార్తలకు తెరదించాడు. ఈ ప్రాజెక్టు గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. "డేట్స్ సర్దుబాటు చేయడం చాలా కష్టంగా మారింది. అందుకే నేను ఈ సినిమా చేయడం లేదు" అని అతడు అన్నాడు.

తెలుగు సినిమాల మేకింగ్ విధానంపై టోవినో ఆసక్తికర వ్యాఖ...