భారతదేశం, నవంబర్ 23 -- Top OTT Releases: సినిమా ప్రియులకు, వెబ్ సిరీస్ అభిమానులకు నవంబర్ 23 నుంచి 29 మధ్య వారం పాటు పండగే. అంతర్జాతీయ, ప్రాంతీయ వెబ్ సిరీస్‌లు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, సోనీలివ్ వేదికలుగా అందుబాటులోకి వస్తున్నాయి. ఈ వారం తప్పక చూడాల్సిన టాప్ ఓటీటీ రిలీజ్‌ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

అజయ్ దేవగణ్ మరోసారి విజయ్ సాల్గావ్కర్‌గా అలరించిన సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ 'దృశ్యం: ది కంక్లూజన్' ఎట్టకేలకు ఓటీటీలోకి అడుగుపెడుతోంది. అక్టోబర్ 2న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.589 కోట్లకు పైగా వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించింది.

అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహించిన ఈ దృశ్యం మూడో భాగంలో టబు, శ్రియా శరణ్, జైదీప్ అహ్లావత్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రల్లో మెరిశారు. తన కుటుంబాన్ని కాపాడుక...