భారతదేశం, ఆగస్టు 3 -- Top OTT: భారతదేశంలో డిజిటల్ వినోద రంగం మునుపెన్నడూ లేనంత వేగంగా విస్తరిస్తోంది. స్మార్ట్‌ఫోన్ లభ్యత, సరసమైన డేటా ప్యాక్‌లు, స్మార్ట్ టీవీల వినియోగం పెరగడంతో డిజిటల్ వీక్షకులు సాంప్రదాయ టీవీల నుంచి ఓటీటీ (OTT) వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఇండియన్ మార్కెట్లో గ్లోబల్, రీజినల్ ఓటీటీ దిగ్గజాల మధ్య తీవ్రమైన 'ఓటీటీ వార్' (OTT War) నడుస్తోంది.

తాజాగా వెలువడిన మార్కెట్ షేర్ డేటా ప్రకారం.. డిజిటల్ స్ట్రీమింగ్ రేసులో అమెజాన్ ప్రైమ్ వీడియో టాప్ ప్లేస్ లో నిలిచింది. తన మెయిన్ కాంపిటీటర్ నెట్‌ఫ్లిక్స్ ను ప్రైమ్ వీడియో ఓటీటీ వెనక్కి నెట్టింది. గ్లోబల్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ దానికి అత్యంత సమీపంలోకి వచ్చి, చివరకు రెండో స్థానంతో సరిపెట్టుకుంది.

అమెజాన్ ఈ-కామర్స్ షాపింగ్‌తో కూడిన 'ప్రైమ్ మెంబర్‌షిప్' బండిలింగ్ ఆఫర్ ఈ ప్లాట్‌ఫామ్‌కు అత...