భారతదేశం, ఏప్రిల్ 8 -- ఓవైపు గ్యాస్ ఆందోళన జనాల్లో ఇంకా కొనసాగుతూనే ఉంది. ఏం వండాలి అనేది చాలా మంది మహిళలు ఆలోచించి.. ఆలోచించి.. అదో పెద్ద టాస్క్ అయిపోతుంది. సాంబార్, రసంలాంటివి తయారు చేసి రోజూ ఏం తింటారు. భోజనాన్ని త్వరగా ముగించాలనుకునే వారు ఈ టొమాటో పులావ్‌ను ప్రయత్నించవచ్చు. ఈ టొమాటో పులావ్ తయారు చేయడం చాలా సులభం, చాలా రుచికరంగా కూడా ఉంటుంది.

ఈ టమాటా పులావ్ తయారు చేయడానికి ఎక్కువ సమయం పట్టదు. దీని రుచి అచ్చం బిర్యానీలాగే ఉంటుంది. మీ ఇంట్లో పిల్లల నుండి పెద్దల వరకు అందరూ దీన్ని ఇష్టపడతారు. బిర్యానీకి ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నట్లయితే ఈ పులావ్‌ను తప్పకుండా ప్రయత్నించాలి. బిర్యానీ ఫ్లేవర్‌లో టొమాటో పులావ్ ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకోండి.

కావలసిన పదార్థాలు : బియ్యం - 1 కప్పు, టమాటాలు - 3 (తరిగినవి), నీళ్ళు - 1.5 కప్పు, చిన్న ఉల్లిపా...