భారతదేశం, ఆగస్టు 23 -- జపాన్‌ను భూకంపం మరోసారి భయపెట్టింది. ఆదివారం తెల్లవారుజామున తూర్పు జపాన్‌లో సంభవించిన భూకంపం కారణంగా రాజధాని టోక్యో ప్రాంతం ఒక్కసారిగా వణికిపోయింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.9గా నమోదైందని అధికారులు తెలిపారు. అయితే ఈ ప్రమాదంతో ఎలాంటి సునామీ ముప్పు లేదని స్పష్టం చేయడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

జపాన్ వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. తరచూ భూకంపాలు సంభవించే ఇబరాకి ప్రిఫెక్చర్ దక్షిణ ప్రాంత భూగర్భంలో 70 కిలోమీటర్ల లోతున ఈ భూకంపం కేంద్రీకృతమైంది.

అయితే యూఎస్ జియోలాజికల్ సర్వే మాత్రం దీని తీవ్రతను 5.8గా రికార్డ్ చేసింది.

ఈ జపాన్ భూకంపం కారణంగా నాలుగు ప్రిఫెక్చర్లలో మొత్తం 23 మంది గాయపడ్డారు. సైతామాలో తొమ్మిది మంది, కనగావాలో తొమ్మిది మంది, చిబాలో నలుగురు, ఇబరాకిలో ఒకరు గాయపడినట్లు ఆయా ప్రాంతాల అధికారులు...