భారతదేశం, మే 22 -- Andhra Padesh Temperature today : భారతదేశాన్ని ఎండలు ముంచెత్తుతున్నాయి. భానుడి తాపానికి ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు జనం అల్లాడిపోతున్నారు. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శాస్త్రవేత్త నరేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. రాబోయే 6 నుంచి 7 రోజుల పాటు దేశంలోని అనేక రాష్ట్రాల్లో తీవ్రమైన వడగాల్పుల పరిస్థితులు కొనసాగుతాయి. పంజాబ్, హరియాణా, దిల్లీ-ఎన్​సీఆర్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, విదర్భ, ఒడిశా, కోస్తా ఆంధ్రప్రదేశ్‌లకు ఐఎండీ 'ఆరెంజ్ అలర్ట్' జారీ చేసింది. అలాగే తూర్పు ఉత్తరప్రదేశ్, తూర్పు మధ్యప్రదేశ్, విదర్భలోని కొన్ని ప్రాంతాలకు రాబోయే మూడు రోజుల పాటు 'రెడ్ అలర్ట్' ప్రకటించారు. దేశంలోనే అత్యధికంగా యూపీలోని బండాలో 48.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

రాబోయే నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వడగాల్పుల తీవ్రత మరింత పెరుగుతుందని విశాఖపట్...