భారతదేశం, జూలై 24 -- Today OTT: ప్రస్తుతం ఓటీటీ ప్రపంచంలో కంటెంట్ డ్రివెన్ కథలకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా విక్రాంత్ మాస్సీ లాంటి వర్సటైల్ యాక్టర్ నటించిన ప్రాజెక్ట్స్ అంటే డిజిటల్ వీక్షకులలో ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. ఆ అంచనాలకు తగ్గట్టే రుచిర్ అరుణ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ముసాఫిర్ కేఫ్' సీజన్ 1 ఓటీటీలోకి వచ్చేసింది.

ఫ్రైడే వచ్చిందంటే చాలు ఓటీటీ సందడి వేరే లెవల్ లో ఉంటుంది. ఈ రోజు (జూలై 24) కూడా ఓటీటీలో సినిమాలు, సిరీస్ లు వచ్చేశాయి. ఈ క్రమంలోనే హిందీ వెబ్ సిరీస్ 'ముసాఫిర్ కేఫ్' కూడా ఓటీటీలో రిలీజైంది. ఈ సిరీస్ పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

ముసాఫిర్ కేఫ్ సిరీస్ కథ చందర్ (విక్రాంత్ మాస్సీ) అనే యువకుడి చుట్టూ తిరుగుతుంది. చందర్‌కు సుధ అనే అమ్మాయితో విడదీయరాని మానసిక అనుబంధం ఏర్పడుతుంది. వీళ్...