భారతదేశం, మే 18 -- జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం మే 18వ తేదీ చాలా కీలకమైనది. ఈ రోజు సోమవారం కావడంతో శివుడి ఆరాధన విశేష ఫలితాలను ఇస్తుంది. సాధారణంగా సోమవారం నాడు పరమశివుడిని భక్తితో కొలిస్తే ఆ ఇంట్లో సిరిసంపదలకు లోటు ఉండదని భక్తుల నమ్మకం. గ్రహ గతుల మార్పుల వల్ల ఈ రోజు కొన్ని రాశుల వారికి అదృష్టం పట్టనుండగా, మరి కొందరు కొన్ని జాగ్రత్తలు పాటించక తప్పదు. మేషం నుంచి మీనం వరకు ద్వాదశ రాశుల వారి పరిస్థితి ఏంటో ఇప్పుడు లోతుగా పరిశీలిద్దాం.

మేష రాశి వారికి ఈ రోజు కొంత హడావుడిగా గడిచే అవకాశం ఉంది. ఉదయం నుంచే ఆఫీసు పనుల ఒత్తిడి మిమ్మల్ని వెంటాడుతుంది. ఏదైనా ముఖ్యమైన పనిని గడువులోగా పూర్తి చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే, ఆర్థికంగా ఉన్న చింతలు ఈ రోజుతో తగ్గుముఖం పట్టవచ్చు. ఇంట్లో చిన్నపాటి గొడవలు జరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి అనవసర వాదనలకు ...