భారతదేశం, మే 13 -- తమిళనాడు అసెంబ్లీలో బలపరీక్ష అనే గండాన్ని నూతన ముఖ్యమంత్రి విజయ్​ సులభంగా గట్టెక్కారు! బుధవారం ఉదయం జరిగిన బల నిరూపణలో విజయ్​కి చెందిన టీవీకే పార్టీ ఎమ్మెల్యేలతో పాటు మొత్తం 144 మంది ఆయన ప్రభుత్వానికి మద్దతిచ్చారు.

ఈ ఫ్లోర్​ టెస్ట్​లో డీఎంకే వాకౌట్ చేయగా.. తమ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ టీవీకేకి వ్యతిరేకంగా ఓటు వేస్తామని అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామి ప్రకటించారు. కానీ ఆయన నిర్ణయానికి వ్యతిరేకంగా 25మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు.. విజయ్​కి అనుకూలంగా ఓటువేశారు.

234 సీట్లున్న తమిళనాడు అసెంబ్లీలో మెజారిటీ మార్కు 118గా ఉంది.

బలపరీక్షలో విజయం అనంతరం అసెంబ్లీ వేదికగా విజయ్​ కీలక వ్యాఖ్యలు చేశారు.

"నా ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తుంది. ఈ ప్రభుత్వం.. నా పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసిన వారిది కూడా. విజిల్ (టీవీకే ఎన్నికల చిహ్నం...