Tirumala Updates : అక్టోబర్ 26న తిరుమలలో పౌర్ణమి గరుడ సేవ - మాడ వీధుల్లో దర్శనమివ్వనున్న శ్రీమలయప్ప స్వామి
భారతదేశం, అక్టోబర్ 24 -- Tirumala Pournami Garuda Seva : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలో అక్టోబర్ 26వ తేదీన పౌర్ణమి గరుడ సేవను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సర్వం సిద్ధం చేసింది. పవిత్రమైన పౌర్ణమి ఘడియల సందర్భాన్ని పురస్కరించుకుని ఈ విశేష వాహన సేవను చేపట్టనున్నారు.
అక్టోబర్ 26న రాత్రి 7 గంటల నుంచి 9 గంటల నడుమ పౌర్ణమి గరుడ సేవ కన్నులపండువగా సాగనుంది. సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్పస్వామివారు సువర్ణ కాంతులతో భాసిల్లే గరుడ వాహనంపై వేంచేసి తిరుమల తిరుమాడ వీధులలో ఊరేగనున్నారు. ఈ పవిత్ర సమయంలో తిరువీధుల్లో విహరిస్తూ స్వామివారు భక్తులకు దివ్య దర్శనం ఇవ్వనున్నారు.
సప్తగిరీశుడి వాహనాల్లో గరుడ వాహన సేవ అత్యంత విశిష్టమైనదిగా భక్తులు భావిస్తారు. ప్రతి నెల పౌర్ణమి రోజున నిర్వహించే ఈ సేవను దర్శించుకునేందుకు తెలుగు ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.