భారతదేశం, మే 29 -- Tirumala Srivani Ticket Changes : తిరుమల కొండపై కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు మరింత సౌకర్యవంతంగా సేవలందించేందుకు టీటీడీ పలు మార్పులు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా 'శ్రీవాణి' ట్రస్టుకి సంబంధించిన వీఐపీ బ్రేక్ దర్శన టికెట్ల కేటాయింపు నిబంధనలలో టీటీడీ పాలకమండలి కొన్ని కీలక మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం.. టీటీడీ రోజుకు మొత్తం 1,500 శ్రీవాణి దర్శన టికెట్లను ఆన్‌లైన్ ద్వారా భక్తులకు అందుబాటులో ఉంచుతోంది. వీటిలో 500 దర్శన టికెట్లను మూడు నెలల ముందే అడ్వాన్స్ బుకింగ్ చేసుకునేలా ఆన్‌లైన్‌లో విడుదల చేస్తున్నారు. అదేవిధంగా.. తిరుపతికి విమానాల్లో వచ్చే భక్తుల సౌకర్యార్థం రేణిగుంట (తిరుపతి) విమానాశ్రయంలోని కరెంట్ బుకింగ్ కౌంటర్ ద్వారా ...