Tirumala Temple : తిరుమల శ్రీవారి ఆలయంలో వైభవంగా పౌర్ణమి గరుడసేవ
భారతదేశం, జూన్ 1 -- తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం రాత్రి పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు ధగధగా మెరిసిపోతున్న గరుడునిపై తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు.
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ చినజీయర్ స్వామి, టీటీడీ బోర్డు సభ్యులు శాంతారామ్, జేఈవో (ఆరోగ్యం&విద్య) డాక్టర్ శరత్, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించిన వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం రాత్రి ధ్వజావరోహణ ఘట్టంతో విజయవంతంగా ముగిశాయి. రాత్రి 8.40 గంటలకు వేదమంత్రోచ్ఛారణలు, మ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.