భారతదేశం, నవంబర్ 10 -- Tirumala Pushpayagam 2026 : కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబరు 16వ తేదీన పుష్పయాగ మహోత్సవాన్ని అత్యంత శాస్త్రోక్తంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ఏర్పాట్లు చేస్తోంది.

స్వామివారికి జరిగే సేవల్లో తెలిసీ తెలియక జరిగే లోపాలకు ప్రాయశ్చిత్తంగా ప్రతీ ఏడాదీ శ్రీవారి బ్రహ్మోత్సవాలు పూర్తయిన తర్వాత కార్తీక మాసంలో ఈ పుష్పయాగాన్ని నిర్వహించడం ఒక ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా నవంబరు 15వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు పుష్పయాగానికి వైభవంగా అంకురార్పణ ఘట్టాన్ని పూర్తి చేయనున్నారు.

మరుసటి రోజు.. అంటే నవంబర్ 16న పుష్పయాగం రోజున ఉదయం శ్రీవారి ఆలయంలో నిత్యం నిర్వహించే రెండవ అర్చన, రెండవ గంట, నైవేద్యం కార్యక్రమాలను ముందుగా పూర్తి చేస్తారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్...