భారతదేశం, మే 3 -- Tirumala Hanuman Jayanthi : కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రం మరో ఆధ్యాత్మిక వేడుకకు సిద్ధమైంది. ప్రతి ఏటా వైశాఖ మాసం బహుళ దశమి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించే హనుమజ్జయంతి ఉత్సవాలను ఈ ఏడాది మే 12వ తేదీన అత్యంత వైభవంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అంజనాద్రి పుత్రుడైన హనుమంతుడి జన్మస్థలంగా భాసించే ఈ పుణ్యక్షేత్రంలో ఆ రోజున భక్తిభావం వెల్లివిరియనుంది.
శ్రీవారి ఆలయానికి ఎదురుగానున్న శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి, కాలినడకబాటలో ఏడవ మైలు వద్ద ఉన్న శ్రీప్రసన్న ఆంజనేయస్వామి వారికి హనుమజ్జయంతినాడు ప్రత్యేక పూజలు జరుగనున్నాయి.
తిరుమల కొండల్లోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండే జాపాలి తీర్థానికి ఒక ప్రత్యేకత ఉంది. హనుమజ్జయంతి సందర్భంగా ఇక్కడి స్వామివారికి టీటీడీ తరపున అధికారికంగా పట్టు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.