భారతదేశం, జూలై 9 -- Tirumala Brahmotsavam 2026 : కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రంలో ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించబోయే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఈ ఏడాది అధికమాసం రావడం వల్ల తిరుమల కొండపై రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు.

ఈ నేపథ్యంలో, నిర్దేశిత సమయంలోపు అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేయాలని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్‌. వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు. తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో ఉన్న సుధర్మ సమావేశ మందిరంలో గురువారం ఆయన జేఈవో డాక్టర్ ఏ. శరత్, సీవీఎస్వో మురళీకృష్ణలతో కలిసి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విభాగాల వారీగా చేపట్టాల్సిన పనులపై దిశానిర్దేశం చేశారు.

ఈ ఏడాది జరిగే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సంబ...