Tirumala Brahmotsavam 2026 : తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు - మోహినీ అవతారంలో మలయప్పస్వామి దర్శనం
భారతదేశం, అక్టోబర్ 16 -- Tirumala Navaratri Brahmotsavam 2026 Updates : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో ఐదో రోజైన శుక్రవారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు జగన్మోహనాకారంలో మోహినీ అవతారాన్ని ధరించి భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. సర్వాలంకార భూషితుడైన శ్రీవారి రూపాన్ని చూసి భక్తజనం మైమరిచిపోయారు. అదే సమయంలో, స్వామివారికి తోడుగా మరొక తిరుచ్చిపై శ్రీకృష్ణస్వామివారి అలంకారంలో మలయప్పస్వామి అభయం అందించారు.
కోలాహలంగా సాగిన ఈ పల్లకీసేవ ముందర గజరాజులు గంభీరంగా నడిచాయి. భక్తజన బృందాల శ్రావ్యమైన భజనలు, ఉత్సాహభరితమైన కోలాటాలు, జీయ్యంగార్ల వేద ఘోషలు, మంగళవాయిద్యాల దివ్య నాదాల నడుమ స్వామివారి ఊరేగింపు కన్నుల పండువగా సాగింది. తిరుమల మాడ వీధుల్లో అడుగడుగునా భక్తులు కర్పూర హారత...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.