Tirumala : శ్రీవారి హుండీ మిశ్రమ బియ్యం ఈ-వేలం.... మీరు ఇలా పాల్గొనొచ్చు..!
భారతదేశం, జూన్ 23 -- కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకునేందుకు దేశ విదేశాల నుంచి ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. స్వామివారిపై ఉన్న భక్తిప్రపత్తులతో భక్తులు తిరుమల ఆలయంతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అనుబంధ ఆలయాల హుండీలలో నగదు, బంగారంతో పాటు పెద్ద ఎత్తున బియ్యాన్ని కూడా కానుకగా సమర్పిస్తుంటారు. ఇలా హుండీ ద్వారా భక్తులు మొక్కుబడిగా సమర్పించిన మిశ్రమ బియ్యాన్ని ఈ-వేలం (ఆన్లైన్ వేలం) ద్వారా విక్రయించాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు.
మొత్తం 20 లాట్లుగా ఉన్న 7,938 కిలోల మిశ్రమ బియ్యాన్ని 2026 జూలై 7వ తేదీన ఈ-వేలం ద్వారా విక్రయించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక కొనుగోలు పోర్టల్ ద్వారా ఈ వేలం ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరగనుంది. ఈ వేలానికి సంబంధించిన ఆక్షన్ ఐడీ నంబర్ 26120 గా అధిక...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.