భారతదేశం, మార్చి 6 -- దివ్వెల మాధురి, బిగ్‌బాస్‌ ఫేమ్‌ తనూజ తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. తనూజ పుట్టినరోజు సందర్భంగా తిరుమలకు కేక్‌ తీసుకువచ్చి అతిథిగృహంలో కట్చేశారు. కేక్‌ను తిరుమలకు తీసుకెళ్లడం, కట్‌ చేయడం తితిదే నిబంధనలకు విరుద్ధం.

గురువారం ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, మాధురి, తనూజ శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చి శ్రీపద్మావతి విచారణ కేంద్రం పరిధిలోని శ్రీవిభవ అతిథిగృహాన్ని తీసుకున్నారు. అందులో మాధురి.. తనూజతో కేక్‌ను కట్ చేయించారు. ఈ వేడుకను వీడియో తీయించి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ఈ వ్యవహారాన్ని టీటీడీ ఉన్నతాధికారులు సీరియస్ గా తీసుకున్నారు.

దివ్వెల మాధురి, తనూజపై టీటీడీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరిద్దరూ తిరుమలలో బర్త్ డే వేడుకలు చేసుకున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. త...