భారతదేశం, ఏప్రిల్ 27 -- Tirumala May Festivals 2026 : శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం అప్డేట్ ఇచ్చింది. మే నెలలో తిరుమలలో నిర్వహించే విశేష పర్వదినాల వివరాలను ప్రకటించింది. మే 1వ తేదీన కూర్మ జ‌యంతి, పౌర్ణ‌మి గ‌రుడ‌సేవ‌ ఉండనుంది. మే 12వ తేదీన హ‌నుమ‌జ్జ‌యంతి నిర్వహిస్తారు.

ప్రతి నెలా పౌర్ణమి నాడు తిరుమలలో జరిగే గరుడ వాహన సేవ మే నెలలో కూడా ఘనంగా నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటల నుండి మాడ వీధుల్లో మలయప్ప స్వామి వారు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు.

మే నెల వేసవి సెలవుల సమయం కావడంతో భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది. దర్శనం టికెట్లు ముందుగానే బుక్ చేసుకున్న వారు, దర్శన సమయానికి అనుగుణంగా తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలి. ఎండల దృష్ట్యా టీటీడీ మాడ వీధుల్లో మరియు క్యూ లైన్లలో ప్రత్యేక షెడ్లు, చల్లని నీటి సౌకర్యం కల్పిస్తోం...