Tirumala : తిరుమలలో భక్తజన సందోహం - ఈనెల 29న వీఐపీ బ్రేక్, శ్రీవాణి దర్శనాలు రద్దు..!
భారతదేశం, జూన్ 28 -- Tirumala VIP Break Darshan Cancelled : కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శనార్థం వచ్చే భక్తుల సంఖ్య అమాంతం పెరిగింది. వేసవి సెలవులు ముగింపు దశకు చేరుకోవడం, దీనికి తోడు శని, ఆదివారాల వారాంతపు సెలవులు రావడంతో తిరుమల గిరులు భక్తజనసందోహంతో పోటెత్తాయి.
ఈ అనూహ్య రద్దీని దృష్టిలో ఉంచుకుని, సాధారణ భక్తులకు పెద్దపీట వేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఎక్కువ మంది సర్వదర్శనం భక్తులకు త్వరితగతిన స్వామివారి దర్శన భాగ్యం కల్పించేందుకు వీలుగా రాబోయే సోమవారం(జూన్ 29) వీఐపీ బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు టీటీడీ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ నిర్ణయం కారణంగా ఆదివారం రోజు ఎలాంటి వీఐపీ బ్రేక్ సిఫార్సు లేఖలను స్వీకరించబోరని అధికారులు స్పష్టం చేశారు. కేవలం ప్రోటోకాల్ పరిధి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.