భారతదేశం, ఏప్రిల్ 1 -- తిరుమలకు వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్యమైన అలర్ట్ ఇచ్చింది. భక్తుల సౌకర్యార్థం తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో (తిరుమల నుండి తిరుపతి వెళ్ళే కనుమ దారి) బీ.టీ రోడ్డు మారమ్మతు పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో వాహనదారులు మరింత అప్రమత్తంగా వాహనాలను నడపాలని విజ్ఞప్తి చేసింది.
శ్రీవారి భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఘాట్ రోడ్డును మూసివేయకుండా నిర్దేశించిన సమయంలో మరమ్మతు పనులను పూర్తి చేసేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. భక్తులు వారి తిరుమల ప్రయాణాన్ని తదనుగుణంగా మార్చుకుని కనీసం గంట ముందుగా ప్రారంభించాలని కోరింది.
మరమ్మతుల కారణంగా వాహనదారులు నెమ్మదిగా అక్కడక్కడా కొద్ది సేపు ఆగుతూ ప్రయాణించాల్సి ఉంటుందనే విషయాన్ని గమనించాలని టీటీడీ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తిరుమల నుంచి రేణిగుంట ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.