భారతదేశం, నవంబర్ 19 -- TIME100 Next India: ప్రపంచ ప్రఖ్యాత 'టైమ్' మ్యాగజైన్ తొలిసారిగా రూపొందించిన 'టైమ్ 100 నెక్ట్స్ ఇండియా' జాబితాలో బాలీవుడ్ అగ్ర కథానాయిక ఆలియా భట్ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. దేశ భవిష్యత్తును తమ పనితీరు, ఆలోచనలు, దృక్పథంతో తీర్చిదిద్దుతున్న వర్ధమాన నాయకులు, సృజనాత్మక ప్రతిభావంతులకు గుర్తింపుగా టైమ్ ఈ ప్రత్యేక జాబితాను విడుదల చేసింది.

ఇందులో ఆలియా భట్ కవర్ స్టార్‌గా మెరవగా, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఆమె గురించి ప్రత్యేకంగా ప్రశంసాపూర్వక వ్యాసం రాయడం విశేషం. ఈ జాబితాలో ఆలియాతో పాటు ఆర్యన్ ఖాన్, అనిరుధ్ రవిచందర్, పార్వతి తిరువోతు, క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ తదితర యువ ప్రముఖులకు చోటు దక్కింది.

తన 'ఆర్ఆర్ఆర్' (RRR) చిత్రంలో 'సీత' పాత్రలో నటించిన ఆలియా భట్ అంకితభావాన్ని రాజమౌళి ఈ వ్యాసంలో ఆకాశానికెత్తారు. "ఆలియా ...