భారతదేశం, మార్చి 28 -- ప్రపంచ గోల్ఫ్ దిగ్గజం టైగర్ వుడ్స్ మరోసారి వార్తల్లో నిలిచారు. అమెరికా ఫ్లోరిడాలో శుక్రవారం జరిగిన ఒక రోడ్డు ప్రమాదం అనంతరం ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన నివాసానికి సమీపంలో కారు వేగంగా నడుపుతూ ప్రమాదానికి గురవ్వడంతో, పోలీసులు ఆయనపై డ్రైవింగ్ అండర్ ఇన్​ఫ్లుయెన్స్ (డీయూఐ) కేసు నమోదు చేసి అరెస్ట్​ చేశారు.

అయితే, ఫ్లోరిడా చట్టాల ప్రకారం ఎనిమిది గంటల నిర్బంధం తర్వాత ఆయన విడుదలయ్యే అవకాశం ఉంది.

మార్టిన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం అందించిన వివరాల ప్రకారం.. జూపిటర్ ఐలాండ్​లోని తన ఇంటి సమీపంలో టైగర్ వుడ్స్ తన ల్యాండ్ రోవర్ కారులో వేగంగా వెళుతున్నారు. ఒక ట్రక్కును ఓవర్‌టేక్ చేసే క్రమంలో ఆయన కారు ఆ ట్రక్కు వెనుక ఉన్న ట్రైలర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ధాటికి వుడ్స్ ప్రయాణిస్తున్న కారు పల్టీ కొపడిపోయింది. ప్రమాదం జరిగిన ...