భారతదేశం, అక్టోబర్ 11 -- Ravi Teja Thulabharam Title Promo Released: బాక్సాఫీస్ వద్ద 'ఇరుముడి' సినిమాతో ఘనవిజయం అందుకున్న మాస్ మహారాజా రవితేజ తన తదుపరి ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించారు. వైవిధ్యమైన కథనాలతో టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసిన ప్రతిభావంతుడైన దర్శకుడు వివేక్ ఆత్రేయతో రవితేజ సినిమా ఫిక్స్ అయిన విషయం తెలిసిందే.

రవితేజ, వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ క్రేజీ చిత్రానికి 'తులాభారం' అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. బ్రిడ్జ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై లక్ష్మణ్, శ్రీని రావు సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సాధారణంగా సినిమాల టైటిళ్లను పోస్టర్ లేదా చిన్న వీడియో ద్వారా ప్రకటిస్తుంటారు. అయితే వివేక్ ఆత్రేయ తనదైన శైలిలో ఒక ఆసక్తికరంగా 'టైటిల్ డాక్యుమెంటరీ' పేరుతో ప్రోమోను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. టైటిల్ ఎంపిక వె...