భారతదేశం, అక్టోబర్ 2 -- Thriller Web Series: దేశ చరిత్రలోనే అత్యంత భయానక దుర్ఘటనగా మిగిలిపోయిన భోపాల్ గ్యాస్ ట్రాజెడీ నేపథ్యంలో తెరకెక్కిన వెబ్ సిరీస్ 'ది రైల్వే మెన్' (The Railway Men) ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో సంచలనం సృష్టిస్తోంది. దాదాపు 15,000 మంది అమాయక ప్రజలను బలిగొన్న ఆ దారుణమైన ఘటన వెనుక ఉన్న రియల్ హీరోల కథ ఆధారంగా రూపొందిన ఈ 4 ఎపిసోడ్ల థ్రిల్లర్ వెబ్ సిరీస్ 8.4 ఐఎండీబీ (IMDb) రేటింగ్‌తో డిజిటల్ స్పేస్‌లో హల్ చల్ చేస్తోంది.

1984 డిసెంబర్ 2 అర్ధరాత్రి భోపాల్‌లోని యూనియన్ కార్బైడ్ (Union Carbide) ఫ్యాక్టరీ నుంచి అత్యంత ప్రమాదకరమైన మిథైల్ ఐసోసైనేట్ (MIC) గ్యాస్ లీక్ అయింది. కొన్ని గంటల్లోనే ఆ విషవాయువు నగరమంతటా అలుముకుని వేలాది మంది ప్రజల ఊపిరి తీసేసింది.

చుట్టూ చావు కేకలు, విషవాయువుతో నిండిపోయిన గాలి ఉన్న ఆ సమయాన భోపాల్ జంక్షన్ ర...