భారతదేశం, జూలై 17 -- Thriller Web Series: 'చిన్నారి పెళ్లికూతురు' ఫేమ్ అవికా గోర్ లీడ్ రోల్‌లో నటించిన ఇన్వెస్టిగేటివ్ సస్పెన్స్ థ్రిల్లర్ 'వధువు' (Vadhuvu) జియోహాట్‌స్టార్‌లో సైలెంట్‌గా ట్రెండ్ అవుతూ మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఏడు ఎపిసోడ్ల పాటు సాగే ఈ థ్రిల్లర్ సిరీస్ లో ప్రతి నిమిషం ఊహించని ట్విస్టులతో డిజిటల్ ఆడియన్స్‌ కు మంచి థ్రిల్ పంచుతోంది.

'ఉయ్యాల జంపాల', 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' లాంటి హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న అవికా గోర్ ఇందులో 'ఇందు' అనే పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించింది. పెళ్లి చేసుకుని కొత్తగా అత్తారింట్లో అడుగుపెట్టిన ఇందుకి.. ఆ ఇంట్లోని మనుషుల వింత ప్రవర్తన తీవ్రమైన అనుమానాలు రేకెత్తిస్తుంది.

గతంలో ఒక పెళ్లి రద్దవ్వడంతో తన పాత జీవితం ఎక్కడ బయటపడుతుందో అనే భయంతో సతమతమయ్యే ఇందుకి అత్తవారి...