భారతదేశం, ఆగస్టు 17 -- The Red Bag Release Date Announced PVR Inox: టాలీవుడ్‌లో సరికొత్త కథాంశాలతో వచ్చే సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలకు ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. అదే బాటలో సస్పెన్స్, క్రైమ్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది 'ది రెడ్ బ్యాగ్' మూవీ.

మెమరీ మేకర్స్ బ్యానర్‌పై హరికృష్ణ సోమిశెట్టి నిర్మించిన ది రెడ్ బ్యాగ్ చిత్రానికి రవి కుమార్ సీరపు దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన ది రెడ్ బ్యాగ్ గ్లింప్స్, టీజర్ సినిమాపై ఆసక్తిని రేకెత్తించగా, మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ మోపురి అందించిన పాటలు యూట్యూబ్‌లో మంచి వ్యూస్‌తో ట్రెండింగ్‌లో నిలిచాయి.

ప్రమోషన్లలో వేగం పెంచిన చిత్రబృందం తాజాగా ది రెడ్ బ్యాగ్ సినిమా థియేట్రికల్ రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించింది. ఆగస్ట్ 21న 'ది రెడ్ బ్యాగ్' చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల ...