భారతదేశం, సెప్టెంబర్ 11 -- The Paradise Trailer: నేచురల్ స్టార్ నాని తన మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా మూవీ 'ది ప్యారడైజ్' (The Paradise) విషయంలో ఎవ్వరూ ఊహించని షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాకి అసలు థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేయడం లేదని అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ప్రెస్ మీట్ పెట్టి మరీ నాని స్వయంగా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేయడంతో ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు.

ది ప్యారడైజ్ మూవీ ట్రైలర్ రావడం లేదనే వార్తలతో సోషల్ మీడియాలో రకరకాల రూమర్స్ ప్రచారమయ్యాయి. వీటిపై క్లారిటీ ఇవ్వడానికే నాని ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని, మల్టిపుల్ యూనిట్స్ ఒకేసారి డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నాయని నాని చెప్పారు. సరైన ట్రైలర్ కట్ చేయడానికి సరిపడా టైమ్ లేకపోవడం వల్...