భారతదేశం, సెప్టెంబర్ 26 -- Nani The Paradise Breaks 10 Movies Records: అగ్ర దర్శకుడు సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల తొలి సినిమా దసరాతో డైరెక్టర్‌గా తానేంటో నిరూపించుకున్నాడు. నేచురల్ స్టార్ నానితో తెరకెక్కించిన దసరా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.

ఇప్పుడు నాని-శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో రెండోసారి వచ్చిన సినిమా ది ప్యారడైజ్. దసరా కాంబినేషన్ కావడంతో ది ప్యారడైజ్‌పై బీభత్సమైన అంచనాలు ఏర్పడ్డాయి. ఆయా షేర్, ఏష నాగుల కట్ట సాంగ్స్‌తో ఆ క్రేజ్ మరింత పెరిగింది.

అయితే, భారీ అంచనాలతో సెప్టెంబర్ 24న థియేటర్లలో విడుదలైన ది ప్యారడైజ్ సినిమాకు నెగెటివ్ టాక్ ఎక్కువ వస్తోంది. కానీ, సోషల్ మీడియాలో వస్తోన్న ట్రోలింగ్ అంత నెగెటివ్‌గా సినిమా లేదని, చాలా వరకు ఎంగేజింగ్‌గానే సినిమా ఉందని పలువురు ఇన్‌ఫ్ల్యూయెన్సర్స్ చెబుతున్నారు.

ఇలా పాజిటివ్, నెగెటి...