భారతదేశం, అక్టోబర్ 22 -- The Paradise OTT Cuts: నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామా 'ది ప్యారడైజ్' ఇవాళ (అక్టోబర్ 22) ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో డిజిటల్ ప్రీమియర్ అయింది. థియేటర్లలో విడుదలైన కేవలం నాలుగు వారాల్లోనే ఈ చిత్రం ఓటీటీ వీక్షకుల ముందుకు వచ్చేసింది.

ది ప్యారడైజ్ మూవీ ఓటీటీలోకి అడుగుపెట్టింది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, థియేట్రికల్ వెర్షన్‌తో పోలిస్తే ఓటీటీ వెర్షన్‌లో మేకర్స్ కొన్ని కీలక మార్పులు చేయడం ఇప్పుడు ఫిలిం సర్కిల్స్‌లో ఆసక్తికరంగా మారింది.

ఓటీటీ ఆడియన్స్ ను మరింత ఎంటర్ టైన్ చేయడం కోసం ది ప్యారడైజ్ ఓటీటీ వర్షన్ ను రెడీ చేశారు. ఈ మూవీ థియేటర్లో...