భారతదేశం, సెప్టెంబర్ 24 -- The Paradise OTT: నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో తెరకెక్కిన 'ది ప్యాారడైజ్' (The Paradise) నేడు (సెప్టెంబర్ 24) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై భారీ ఓపెనింగ్స్ దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికే ప్రీమియర్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ది ప్యారడైజ్ సినిమా ఓటీటీ పార్ట్‌నర్‌ ను మేకర్స్ ప్రకటించేశారు.

థియేటర్లలో 'ది ప్యారడైజ్' బిగ్ స్క్రీన్‌ను షేక్ చేస్తున్న వేళ, ఈ సినిమా డిజిటల్ రైట్స్‌పై మేకర్స్ ఊహించిన ప్రకటన చేశారు. పాన్-ఇండియా లెవెల్లో భారీ హైప్‌తో వచ్చిన ఈ రా అండ్ రస్టిక్ యాక్షన్ బిగ్గీ పోస్ట్-థియేట్రికల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల ఆడియన్స్‌ను రీచ్ అయ్యేలా నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఎస్‌ఎల్‌వి సినిమాస్‌కి భారీ ఆఫర్ ఇచ్చి ఈ హక్కులను దక...