భారతదేశం, సెప్టెంబర్ 26 -- Nani The Paradise 2 Days Worldwide Box Office Collection: నేచురల్ స్టార్ నాని నటించిన తాజా యాక్షన్ థ్రిల్లర్ డ్రామా 'ది ప్యారడైజ్' బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీతో ఖాతా తెరిచింది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రూపొందించిన ఈ చిత్రం బుధవారం (సెప్టెంబర్ 23) పెయిడ్ ప్రీమియర్లు, గురువారం (సెప్టెంబర్ 24) గ్రాండ్ రిలీజ్‌తో థియేటర్లలోకి వచ్చింది.

నాని కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్ సాధించిన చిత్రంగా ది ప్యారడైజ్ నిలిచినప్పటికీ, విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది. ఫలితంగా రెండో రోజు వసూళ్లలో స్పష్టమైన తగ్గుదల కనిపించింది.

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, శుక్రవారం (సెప్టెంబర్ 25) రెండో రోజు ది ప్యారడైజ్ చిత్రం భారత బాక్సాఫీస్ వద్ద రూ. 14.90 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. అయితే, తొలిరోజుతో పోలిస్తే ఏకంగా 57 శాతం మేర వసూ...