భారతదేశం, సెప్టెంబర్ 23 -- The Paradise Breakeven: నాని 'ది పారడైజ్' ప్రీ-రిలీజ్ హంగామా బాక్సాఫీస్ దగ్గర తుఫాన్ సృష్టిస్తోంది. సెప్టెంబర్ 23న యూఎస్, రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు మొదలవుతుండటంతో ట్రేడ్ వర్గాల్లో కలెక్షన్ల రచ్చ మొదలైంది. నాచురల్ స్టార్ కెరీర్‌లోనే ఆల్‌టైమ్ హైయెస్ట్ బిజినెస్ జరిపిన ఈ పీరియాడిక్ మాస్ డ్రామా క్లీన్ హిట్ అనిపించుకోవాలంటే ఎంత వసూలు చేయాలనే లెక్కలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

'దసరా' లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత దర్శకుడు శ్రీకాంత్ ఓదెల - నాచురల్ స్టార్ నాని కాంబినేషన్లో వస్తున్న 'ది పారడైజ్' పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ పీరియాడిక్ యాక్షన్ మూవీ థియేట్రికల్ రైట్స్ ఊహించని ధరకు అమ్ముడయ్యాయి.

ట్ర...