భారతదేశం, సెప్టెంబర్ 27 -- Nani The Paradise 3 Days Worldwide Box Office Collection: 'దసరా' వంటి ఊరమాస్ హిట్ తర్వాత నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కిన పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా 'ది ప్యారడైజ్'. భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 24న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తన ఆధిపత్యాన్ని చాటుకుంటోంది.

మొదటి రోజు నుంచే రికార్డు స్థాయి వసూళ్లతో సునామీ సృష్టిస్తోంది ది ప్యారడైజ్ సినిమా. విమర్శకుల నుంచి కొంత మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, నాని మాస్ ఇమేజ్, ఓపెనింగ్స్ హవా కలెక్షన్లను గట్టిగా నిలబెట్టాయి. ఇప్పుడు క్రమంగా ది ప్యారడైజ్ సినిమాకు పాజిటివ్ టాక్ పెరుగుతూ వస్తోంది.

ది ప్యారడైజ్ సినిమా బుధవారం (సెప్టెంబర్ 23) రాత్రి ప్రీమియర్ షోలతో మొదలై, గురువారం (సెప్టెంబర్ 24) ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. నాని...