భారతదేశం, జూలై 15 -- The Paradise: నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ పొలిటికల్ యాక్షన్ డ్రామా 'ది పారడైజ్' చుట్టూ జరుగుతున్న క్రేజీ రూమర్స్ కు మేకర్స్ ఎండ్ కార్డ్ వేశారు. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ను దిల్ రాజు భారీ రేటుకు కొనుగోలు చేశారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ప్రొడక్షన్ హౌస్ అధికారికంగా ప్రకటించింది.

ఈ పారడైజ్ సినిమా థియేట్రికల్ రైట్స్ ను టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సొంతం చేసుకున్నారని, దీనికోసం ఏకంగా రూ.110 కోట్ల ఆఫర్ ఇచ్చారనే ప్రచారం సినీ సర్కిల్స్ లో బాగా నడిచింది.

అయితే ఈ వైరల్ న్యూస్ పై ఎస్‌ఎల్వీ సినిమాస్ ప్రొడ్యూసర్స్ స్పందిస్తూ.. ఇలాంటి ఫేక్ వార్తలను అస్సలు నమ్మవద్దని ప్రేక్షకులను కోరారు. సినిమాకు సంబంధించిన ఏ అప్‌డేట్ అయినా సరే నేరుగా ప...