భారతదేశం, జూలై 18 -- The Odyssey OTT Release Details: 'ఓపెన్‌హైమర్' సినిమాతో ఆస్కార్ అవార్డులను కొల్లగొట్టిన ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ నుంచి మరో అద్భుత దృశ్యకావ్యం థియేటర్లలోకి నిన్న వచ్చేసింది. హోమర్ రాసిన ప్రసిద్ధ పురాణ గాథ (ఇతిహాసం) ఆధారంగా నోలన్ తెరకెక్కించిన 'ది ఒడిస్సీ' (The Odyssey) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా జూలై 17న విడుదలైంది.

2 గంటల 52 నిమిషాల సుదీర్ఘ నిడివి గల ఈ సినిమా తొలిరోజే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతోంది. భారతదేశంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ క్రిస్టోఫర్ నోలన్ సినిమాలకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. గతంలో ఆయన అందించిన ఇంటర్‌స్టెల్లార్, ఇన్‌సెప్షన్, ఓపెన్‌హైమర్ చిత్రాలకు తెలుగులోనూ మంచి కలెక్షన్స్ వచ్చాయి.

ఇక ఇప్పుడు వచ్చిన 'ది ఒడిస్సీ' కూడా అదే స్థాయి అంచనాలతో థియేటర్లలో ఐమాక్స్ (IMA...