భారతదేశం, జూలై 20 -- The Odyssey Collections: హాలీవుడ్ మాస్టర్ మైండ్ క్రిస్టోఫర్ నోలన్ సినిమా వస్తోందంటే ప్రపంచవ్యాప్తంగా థియేటర్ల వద్ద హడావుడి ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హోమర్ రాసిన ప్రాచీన గ్రీకు కావ్యం ఆధారంగా $250 మిలియన్ల (సుమారు Rs.2,080 కోట్లు) భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన 'ది ఒడిస్సీ' ప్రస్తుతం గ్లోబల్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది.

క్రిస్టోఫర్ నోలన్ డ్రీమ్ ప్రాజెక్ట్ 'ది ఒడిస్సీ' రికార్డులు బ్రేక్ చేస్తోంది. కలెక్ష్లన్ల మోత మోగిస్తోంది. ఎలాంటి సూపర్ హీరో ఫ్రాంచైజీ లేదా సీక్వెల్ సపోర్ట్ లేకుండా, ఒక ఒరిజినల్ పీరియాడిక్ కథతో ఈ స్థాయి వసూళ్లు రాబట్టడం హాలీవుడ్ ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది.

యూనివర్సల్ పిక్చర్స్ అధికారికంగా ప్రకటించిన వివరాల ప్రకారం.. 'ది ఒడిస్సీ' విడుదలైన మొదటి మూడు రోజుల్లోనే ప్రప...