భారతదేశం, మార్చి 12 -- ప్రియాంక చోప్రా లీడ్ రోల్ ప్లే చేసిన లేటెస్ట్ యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ 'ది బ్లఫ్'. ఈ మూవీ ఇప్పుడు ఓటీటీని షేక్ చేస్తోంది. డిజిటల్ స్ట్రీమింగ్ లో సత్తాచాటుతోంది. అత్యధిక మంది చూసిన ఒరిజినల్ ఫిల్మ్ గా ది బ్లఫ్ నిలిచింది. మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ ఓటీటీలో ఈ సినిమాను జనాలు తెగ చూసేస్తున్నారు.

వారణాసి హీరోయిన్ ప్రియాంక చోప్రా లేటెస్ట్ మూవీ 'ది బ్లఫ్'. ఈ పైరేట్ అడ్వెంచర్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రంలో 'బ్లడీ మేరీ'గా ప్రియాంక చోప్రా అదరగొట్టింది. ఈ సినిమా ఫిబ్రవరి 25న ఓటీటీలో రిలీజైంది. ఒరిజినల్ ఫిల్మ్ గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో డైరెక్ట్ గా రిలీజ్ అయింది ది బ్లఫ్ మూవీ.

ది బ్లఫ్ మూవీకి మిక్స్ డ్ రివ్యూలు వచ్చాయి. అయినా ఓటీటీలో ఈ సినిమాను ఆడియన్స్ తెగ చూసేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 27 నుంచి మార్చి 5 వరకు ఓటీ...